ఎదో సృజించాలన్న ఆత్రమే సూర్యొదయం అయింది

ఫిబ్రవరి, 2009 నెల టపాలు

గజ్జెల సప్పుడు..

Posted by athram పై ఫిబ్రవరి 28, 2009

సిన్నప్పటి గుర్తులు

“ఏం తాత బాగున్నావ్? ఏం చేస్తున్నవ్?”

“బాగానే ఉన్నా మనవడ? ఏంది గిట్లచ్చినవ్? నువ్వు బాగున్నవా?”

“ఆ ఆ బానే ఉన్నా ఏదో ముచ్చట్లు చెప్తవని “
బడి అయిపొయిన తర్వాత అప్పుడప్పుడు తాత దగ్గరికి వెళ్ళడం అలవాటు.
తాత ఎప్పుడు తెలంగాణ యాసలోనే మాట్లాడే వాడు. నాకు రాయడం రాక ఇలా రాస్తున్నాను.

“నా సిన్నప్పుడు నేను పొలిగాడు మాంచి దొస్తులం ఏడికి పొయినా కలిసే పోయేటోల్లం ఒకరొజు
పొలిగాడికి కల్లు తాగిన సిలక(రామ చిలక, అమ్మాయి కాదు.) కనిపించింది. వాడు ఇడిసిపెడ్తడా ఇదివరకే వాడికి పిట్టలంటే సానా ఇష్టమాయే.
అది పడుతు ఏగుర్తు చెమటలు పొపించి సందేలకు దొరికింది.
దాన్ని వాడు చానా జాగర్తగా చుస్తూ నీల్లు తాగిచ్చిండు, జాంపండ్లు తినిపించిండు.
చూద్దుం గదా అప్పటికే సీకటి అయింది సీకటి అంటే ఇద్దరికి భయమే
ఆ చెట్లల్ల నుండి పొవాలాయే. ఏంచేత్తం ఒకల్ల చెయ్యి ఒకల్లం పట్టుకొని ఎళ్తాన్నం
ఇల్లు ఇంక సగం దూరం ఉందనగా ఎక్కడి నుండొ సిన్న గజ్జెల సప్పుడు నడుస్తున్నా కొద్ది దెగ్గరికొస్తాంది.
పాములకు భయపడం గాని గీ దయ్యలకు మా వణుకొస్తది
ఉరుకుతే ఎంబడి పడ్తదని జల్ది జల్ది నడ్తాన్నం
వాడి ఇంకొ చేతిలో సిలక మాంచిగ పన్నది
ఆ సప్పుడు ఇంకా దెగ్గరికి అత్తాందాయే.. నాకేమొ ఆంజనేయ మంత్రం రాదాయె
వాడు ఆంజనేయ ఆంజనేయ అంటు భయం భయంగా గొణుకుంటాండు
ఏదయ్తే అది అని ఇగ ఉర్కినం
సల్లచమటలు చుసి మా అవ్వ ఒకటే భయపడ్డది
తెల్లరి సూద్దును కదా వాడికి జరం.
జరిగిందంత వాళ్ళ అయ్యకి చెప్పిన
వాల్లఅయ్య కొడిని కొసిండు ఆకులా అన్నం పెట్టి కల్లు పోసి ఇంటెనుక పెటిండు.
వాడి దెగ్గరికెల్లి సిలకేమయిందిరా అన్నా.
పాపం అదెంత భయపడ్డదో అని పొద్దున్నే ఇడిసి పెట్టిన
నేను పట్టుకుంటాంటే ఎంత భయపడ్డదొ పాపం
దానికికూడా జరమొత్తదని ఇడిసిన అన్నడు
మంచిపని చేసినవ్ రా పొలిగా అన్న”

ఇగ పో మల్లా సికటెయ్ తది జల్ది పో అంటే
అక్కడి నుండి బయల్దేరా..

వర్గాలు గుర్తులు, తాత కాడి ముచ్చట్లు | Leave a Comment »

నీకో అవార్డ్, నాకో అవార్డ్

Posted by athram పై ఫిబ్రవరి 25, 2009

ఏంటండి ఈ రొజు ఏంటొ విశేషాలు… అన్ని మాటలు ఐన తర్వాత ఆ పెద్దయన..
“నిన్న మీరెవరైన fever FM విన్నారా”
“నిన్న నేను కార్ల్ వెల్తుంటే విందామంటే నా మనవరాలు అదేదొ meaow FM అంట అది పెటింది”
“ఆ India’s first ladies FM radio అండి అది” అంటు వచ్చాడు ఒరిస్సా అతను.
“మీరు విన్నారా fever FM నిన్న…” అని మాట ముగియక ముందే
“లేదండి.. అంత time లేదండి నాకు.. ఏం?..”
“అందులో ఒక ప్రశ్న అడిగారు.. మీకు మీరుగా మీకొక అవార్డ్ యిచ్చుకుంటే ఏ అవార్డ్ యిచ్చుకుంటారు.”
“నాకయితే..” అంటుండగ
“ద భెస్ట్ ఆశావాది…నాకయితే..మంచి మాటకారి మరి మీకు” ఒరిస్సా అతను.

“నాకా…హు…ఈ సముద్రం కు ఏమిద్దాం “
“శాంతముర్తి యిద్దామా?..” మద్యలో ఆపేస్తు
“అది మన భారత్ కి పెటెంట్ అయింది కదా..” అన్నాడు ఒరిస్సా అతను.

“అయినా ఏన్నో సునామిలు సృష్టించే ఈ సముద్రానికి ఆ అవార్డా ” అంటు అన్నాను
“అయినా అది మనిషి కాదు కద…ఇచ్చినా తీసుకోదు కదా?…” అన్నాను..
“మేము అస్తికులమండి…సముద్రుడు అంటాం.dangerous cool fellow award ఇద్దామా?”
“అది కూడా మనలో వాళ్ళకే పెటెంట్ కదా..” ఒరిస్సా అతను అనడంతో ఒక్క సారిగా అందరం నవ్వుకున్నాం.
“ఎక్కడ చూడు, విను అవార్డ్స్,అవార్డ్స్,అవార్డ్స్ అప్పుడే నాకు విసుగు వచేసిందండి…”
“ఎందుకండి?. నాకు యిప్పటికే చాలా అలస్యం అయింది . వెళ్తాను మరి..” అనడంతో
“నేను కుడా వెళ్ళాలి మరి”
“మంచిదండి నేను కొంచం సేపు ఉండి వెళ్తాను.” అంటూ చేయి ఊపాడు ఒరిస్సా అతను…
“మరి మీకు ఏ అవార్డో చెప్పలేదు ” గుర్తొచ్చి గట్టిగా అరిచాడు.
చిన్నగా నవ్వి కారు ఏక్కాను.

వర్గాలు marine line walkers | 1 అభిప్రాయం »

ఆస్కార్ – మనవడు

Posted by athram పై ఫిబ్రవరి 23, 2009

రోజూ లానే ఈ రోజు marine lines కి వెల్లి సముద్రపు గాలుల మద్య, నా వయసు కల తోటి walkers తొ నడుస్తు
మాట్లాడుకుంటుండగా
“ఏంటండి… ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు..” నా కన్న పెద్దవారయినా నాకు మర్యాదిస్తుంటారు.
“తొందరగా వెల్లేట్టు కూడా కనిపిస్తున్నారు.. అది అడగరే …?” ఇతను ఒరిస్సా అతను చాలా కలుపుగొలు మనిషి..
“ఈ రొజూ ఉదయం నా మనవడు ఫొను చెసి ఆస్కార్ అవార్డ్స్ చుడమని చెప్తేను అది చుడ్డానికి తోందరగా వెళ్ళాలి. మీరు చుస్తారా?..”
“ఏందుకండి మనల్ని మనం తక్కువ చేసుకుంటు ఇంకొకడు ఇచ్చే కపట గౌరవాన్ని చూసి మురవటం”
“అంటే వాల్లు గుర్తించిన ప్రతిభను, వాల్లిచ్చే గౌరవాన్ని వద్దన్దామా, ముందుకెళ్తున్న భారత్ ని ఇప్పుడు ఆపుదామా”
“……”
“ఆపుదాం అనట్లేదు, ఇదొక్కటే సినిమా వచ్చిందా ఇటువంటిది…” మద్యలో ఆపుతు
“ఏందుకు రాలేదు చాలా వచ్చాయి కానీ మనవాళ్ళు కనీసం నామినికి అన్నా పంపించారంటారా?”
నేను దాదాపు మౌనంగానే ఉన్నాను.
“మరి mother India కి ఏందుకు రాలేదు గాంధీ కి ఏందుకొచ్చిందంటారు, అదే గాంధీ ని ఒక భారతీయుడు తీస్తే వస్తుందంటారా ? “
“మరి a.r.rahaman కి ఇప్పుడు వస్తే? .”
“ఇంతకు ముందెప్పుడు అంతకన్నా మంచి పాటలు , music రాలేదా ఆయన దెగ్గరి నుండి”
“ఆస్కార్ అవార్డ్ అంటే ప్రపంచమే గుర్తించినట్లు…అది వస్తే మనకు గర్వ కారణమే కదా”
అతన్ని మద్యలో ఆపుతూ
“కమల్ హసన్ అన్నట్టు ఎప్పుడో ఒక రొజు మనం ఇచ్చే అవార్డ్స్ కొసం ప్రపంచమే ఎదురు చుసే రొజులొస్తాయి..”
“కమల్ హసన్..?”
“కమల్ హసన్..?”
“అదేనండి దషావతారం హేరో”
“ఆ south హేరో నా”
“ఒహొ”
“అయినా ఇప్పుడు ఆ అవార్డ్ నాకు ఇచ్చినా నాకు అంత అనందం లేదు.. నా మనవడి గొంతులో వినపడే ఆనందమే నాకు ఎన్నొ అవార్డ్స్ తొ సమానం.. వాడు a.r.rahaman fan”

“అదీ నిజమే ఇప్పుడు మనకెందుకండి”
“అదే నిజం” అన్నాడు ఆ ఒరిస్సా అతను..

వర్గాలు మనవడి ముచ్చట్లు, marine line walkers | 1 అభిప్రాయం »

embarrassing

Posted by athram పై ఫిబ్రవరి 23, 2009

పాత గుర్తులు…..

నేను నా స్నేహితుడు కలిసి ఒక రొజు బేగంపేట్ లొ ఒకరి కోసం ఎదురు చూస్తుండగా కాలికి ఎదొ తగిలితే తిరిగా

“బాబు ఇక్కడ bust stop ఎక్కడో చెబుతారా. అప్పడి నుండి వెతుకుతున్నాను.” అనడంతో

“సూటిగా వెల్లి ఎడమకు తిరిగితే దగ్గర్లోనే bust stop” అన్నాను.

నా  స్నేహితుడు సిగరేట్ కొసం వెల్లి వచ్చి “ఏంటంటా ముసలొడికి?” అంటూ “ఇందా chocolate” అంటూ నా చేతిలో పెట్టాడు.

“buststop దొరకట్లెదట పాపం”

“ఉండు వెల్లొస్తా వాడు రావడానికి ఇంకా time ఉందిగా” అంటూ వెల్లి పది నిమిషాల తరవతా “pention office కంటా auto ఏక్కించి వాడికి డబ్బులు ఇచ్చా ఒ పది కొట్టు.నా దగ్గర లేవు.”

“మరి ఏ దయ్ర్యం(dhyryam) అయనకు ఇచ్చావ్”

“నువున్నవ్  కదరా. అయినా ముసలయన అందులో గుడ్డి వాడు అతను దారి అడిగితే చూపించక ఆ మాటలేట్రా యెదవ”

“డబ్బులు అయితే ఇవ్వ bus charge నేనే చుసుకుంటా సరేనా సిగరేట్ అంటే అలర్జీ నాకు” అంటూ

sorry అని మనసులో అనుకొని “thanks” అని సిగ్గుతో  తలదించుకున్నా.

వర్గాలు గుర్తులు | 1 అభిప్రాయం »

 
Follow

Get every new post delivered to your Inbox.