వచ్చింది ఆంద్ర ప్రధేశ్ నుండి,
మేము పరిచయం చెసుకున్న తరవాత మాటలమధ్య
“ఇంకా ఆడవాళ్ళను అణిచి పెడ్తున్నారు. ఎప్పుడు మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తారు.”
“అవునా..!! అయినా నేను బావిలో కప్పనండి. నాకు నా చిన్నతనంలో జరిగిన విషయాలు అంతగా గుర్తు లేవండి. ” అని అంటుండగా,
“అంటే అతని ఉద్దేశం ఇక్కడి విషయాలు తప్ప వేరే విషయాలు అంతగా తెలిదు అని” అని పెద్దయన సవరిస్తుండగా,
“అంతే కాదు. అటువంటివి అతని చిన్నతనంలో చూసాడనే కాని ఇప్పుడు చూడట్లేదని.” అని ఒరిస్సా అతను వంతపాడాడు.
“రోజుకోకటన్నా పేపర్లో వస్తుందిగా?” కొంచం అశ్చర్యం, కోపంతో ఆమే అంటుండగా.
“ఇక్కడ అయితే లేవండి.” అని నేను ఆమెను మద్యలో అపాను.
“ఏంతో కట్టుబాట్లు చూపించే ఇక్కడి సేన కూడా ఎప్పుడు అమ్మాయిలను ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న సందర్బాలు లేనే లేవు.”
“ఈ పెద్దాయన ఒకరు సేన అంటరు.” ఒరిస్సా అతను అంటుండగా
“అదీ నిజమే కదండి. మీరెప్పుడన్నా విన్నారాండి?” నేను ఆమెను ప్రశ్నించా.
“ఇక్కడ ఏమొ మరి a.p. లో ఐతే మాత్రం ఇటువంటివి చాలానండి.” అందామే
Driver ని పిలిచి ఆమెకో కాఫి ఇచ్చా.
మళ్ళి నేను ఆ విషయం అంటూ,
“నా దెగ్గర ఐతె అన్నారు కాని మా ఆవిడ దెగ్గర మాత్రం అనకండి. పెద్ద గొడవే
ఒక రోజు ఆమే ఆడవారి హక్కులు అనే ఉపన్యాసం వినడానికి ఆఫిసు ఐన తర్వాత వెళ్ళంది,
అంతా ఐన తర్వాత ఉపన్యసం ఇచ్చిన ఆమె దెగ్గరికెల్లి మాట్లాడుతుంటే ఆమేమొ వెళ్ళెందుకు తొందర పడుతుంది.
ఏంటని అడిగితే మాఅయనా పిల్లలు వస్తారు నేను ఉండక పొతే అరుస్తారండి మీకు తెలుసు కదాండి, అందట, అంతే
అక్కడే అమెను దులిపేసి వచింది.
అప్పటినుండి ఇప్పటివరకు అటువంటి వాటికి వెళ్ళలేదు.
అప్పుడప్పుడు అంటుంది, పైకి అనేవాళ్ళు ఇంట్లొ ఉండకుండ బయటికి వచ్చి మాట్లాడాలి అని.
ఇంటిని చుసుకొవద్దనట్లేదు కాని ఆ భయ పడడం దేనికి అని నేనంటాను.”
“నేనెప్పుడు నాపిల్లల్ని నువ్వు అడ, నువ్వు మగ అని ఎప్పుడు చుడలేదు” అని పెద్దాయన అంటుండగా,
“నా చిన్న కూతురు న్యూయార్క్ లో ఒక్కతే ఉంటుంది నేను ఎప్పుడు నువ్వు అమాయివి అక్కడి వెళ్ళద్దు ఇక్కడి వెళ్ళద్దు అని అనలేదు” అని ఒరిస్సా అతను అన్నాడు.
అప్పటికే అమె దాదాపు మౌనంగా ఉంది.
“మేము అడవాళ్ళం, ఆడవాళ్ళం అని మిమ్మల్ని మీరు ఎందుకలా తక్కవగా చేసుకుంటారు.” నన్ను మద్యలో అపేస్తు,
“అదేదో కులాల వాళ్ళు మేము తక్కువ వాళ్ళం అంటు వాళ్ళను వాళ్ళను తక్కువగా చేసుకున్నట్టుగా,
దాని బదులు మాకు కులం లేదు అనచ్చుగా” అని ఒరిస్సా అతను కల్పించుకున్నాడడు
“మెత్తగా ఉంటే మొత్తుతారట, అన్నట్టు” అని నేను తెలుగులో అనడంతో
“మాకూ అర్థమయే భాషలో చెప్తే వింటాంకదా?” అని పెద్దాయన అనడంతో చెప్పా
“అంతే కదా మరి. మెత్తగా ఉంటే ఆడా లేదు మగా లేదు. ముందు వాళ్ళు గట్టిగా ఉంటే సరి” అన్నాడు పెద్దాయన.”
“మరి మమ్మల్ని ఆడవారిగా ఎందుకు గౌరవించట్లేదు”
“మీరు మల్లి మొదటికే వచ్చారండి” అని ఒరిస్సా అతను అంటుండగా మద్యలో అపేస్తు అన్నాను,
“కొంచం time పడుతుందండి నాకైతే మిమ్మల్ని ఆడవారిగా గుర్తించాలంటే. ఎందుకంటే నేనెప్పుడు మనుషులు గానే చూసాను.
మీరేమనుకోకండి నేను కొంచం వెళ్ళాలి తర్వాత కలుద్దాం”
అని కారు వైపు అడుగులేసా అప్పటికి ముగిసిపొలేదు వాళ్ళ వాదనలు.